పదో తరగతిలో ఏర్పడిన పరిచయం ఓ వివాహితకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పాత పరిచయంతో ఆమెతో తరచూ మాట్లాడిన ఓ కానిస్టేబుల్ కరీంనగర్‌లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, రహస్యంగా వీడియోలు చిత్రీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడి రూ.1.30 లక్షలు తీసుకున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. చివరకు వీడియోలను భర్తకు పంపడంతో ఆమె కాపురం కూడా దెబ్బతింది.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దైంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకుని, ఆదివారం మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఢిల్లీలో కొనసాగుతున్న కీలక రాజకీయ, రాజ్యసభ నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో ఆయన పర్యటన రద్దైనట్లు సమాచారం.
వరంగల్-కరీంనగర్ మధ్య ప్రయాణికులకు గుడ్‌న్యూస్. రూ.1,641 కోట్లతో 68.015 కిలోమీటర్ల మేర నిర్మించిన నాలుగు లేన్ల జాతీయ రహదారి-563 పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ట్రయల్ రన్ ప్రారంభమైన ఈ హైవేను అక్టోబర్ తొలి లేదా రెండో వారంలో అధికారికంగా అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త రహదారితో వరంగల్-కరీంనగర్ ప్రయాణ సమయం దాదాపు గంటన్నర నుంచి 45 నిమిషాలకు తగ్గే అవకాశం ఉంది.
కరీంనగర్ జిల్లాలో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కొత్త కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించడంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పేదలకు సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు పనిచేయాలని సూచించారు.
తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో కీలక మార్పులు రానున్నాయి. డ్రైవింగ్ టెస్టుల్లో రికమండేషన్లు, పైరవీలకు చెక్ పెట్టడంతో పాటు పరీక్షలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియో అనలిటిక్స్ టెక్నాలజీని తీసుకురావాలని రవాణా శాఖ నిర్ణయించింది. తొలి దశలో హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లోని ఐదు డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లతో పాటు కరీంనగర్ ఆర్టీఓ ట్రాక్‌లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.
2004 కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్ తనకు ఒక్క ఎకరం భూమి కూడా లేదని పేర్కొన్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం వేల కోట్ల విలువైన భూములు, ఆస్తులు ఎలా సమకూరాయో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవిట్‌ల ఆధారంగానే కేసీఆర్ ఆస్తుల పెరుగుదలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొంటూ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
పాలు లేకుండానే మైదాతో కలాకంద్, మైసూర్ పాక్ తయారు చేస్తున్న ఓ స్వీటు షాపు బండారం బయటపడింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 40 కిలోల కల్తీ స్వీట్లను ధ్వంసం చేసి, 1,300 కిలోల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
కరీంనగర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ యువభేరి సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. యువతకు ఉద్యోగాలు, నోటిఫికేషన్లు లేవని ఆరోపించిన ఆయన.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీశారు. ఉద్యోగాల కల్పనపై కాంగ్రెస్‌తో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామ శివారులో పురాతన విగ్రహాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. గత ఆరు నెలల్లోనే 12 విగ్రహాలు బయటపడగా, వాటిలో ఎక్కువగా అమ్మవారి విగ్రహాలే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. విగ్రహాలు చెక్కుచెదరకుండా ఉండటంతో వాటికి స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో గతంలో కాకతీయుల కాలం నాటి ఆలయాలు ఉన్నట్లు చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. PMAY-G కింద కేంద్రం నుంచి ప్రతి ఇంటికి రావాల్సిన రూ.72 వేల నిధుల్లో జాప్యం జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
కొండగట్టు సమీపంలో జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 20 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.
సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులకు పాడిపంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.
జగిత్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ను అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలు అందించే కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో కొత్త ఆస్పత్రి భవనం నిర్మాణంతో పాటు జగిత్యాల మెడికల్ కాలేజీలో అన్ని కీలక పీజీ విభాగాలను ప్రారంభించేందుకు నేషనల్ మెడికల్ కమిషన్‌కు వెంటనే దరఖాస్తు చేయాలని అధికారులను ఆదేశించారు.