Peddapalli | పెద్దపల్లిలో అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయండి.. కేంద్రమంత్రిని కోరిన ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామి

Peddapalli | పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు విస్తరించేలా అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లు (ATCs) ఏర్పాటు చేయాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి& వ్యవస్థాపకత శాఖ స్వతంత్ర హోదా సహాయ మంత్రి, విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరిని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర గనులు, కార్మిక శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి కోరారు.

27 జులై, 2026 7:10 PM•ByRamchandram

Share this article

Peddapalli | పెద్దపల్లిలో అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయండి.. కేంద్రమంత్రిని కోరిన ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామి

Peddapalli | న్యూఢిల్లీ, జూలై 27: పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు విస్తరించేలా అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లు (ATCs) ఏర్పాటు చేయాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి& వ్యవస్థాపకత శాఖ స్వతంత్ర హోదా సహాయ మంత్రి, విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరిని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర గనులు, కార్మిక శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి కోరారు. ఈ మేరకు న్యూఢిల్లీలో ఆయన్న మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేశారు.

ఈ భేటీ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల విస్తరణ, యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ, అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్స్ (ATCs) ఏర్పాటు, ఐటీఐల బలోపేతం, కేంద్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి పథకాల సమర్థ అమలు వంటి అంశాలపై చర్చించారు. ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ATCs ఏర్పాటు చేసి, స్థానిక యువతకు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలపై శిక్షణ అందించడంతో పాటు, శిక్షణ అనంతరం పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి కోరారు.

అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ స్కిల్ ఇండియా కార్యక్రమాల ద్వారా మరిన్ని శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి, నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ, సర్టిఫికేషన్, ప్లేస్‌మెంట్ అవకాశాలను విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై స్పందించిన కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సంబంధిత ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి, ATCs ఏర్పాటు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల విస్తరణ, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

R

Written By

Ramchandram

Newsroom Staff

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు