కస్టమర్లను ఆకట్టుకునేందుకు కుర్చీపైనే డ్యాన్స్!..వీడియో వైరల్

ప్లాస్టిక్ కుర్చీ మన్నికను కస్టమర్లకు చూపించేందుకు ఓ విక్రయదారుడు చేసిన వినూత్న ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా కుర్చీలను నేలకేసి కొట్టడం, వంచడం వంటి స్టంట్లు చేసే విక్రయదారులు కనిపిస్తుంటారు. కానీ ఇతడు ఏకంగా కుర్చీపై నిలబడి డ్యాన్స్ చేస్తూ దాని బలాన్ని ప్రదర్శించాడు.

21 సెప్టెంబర్, 2026 6:12 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కస్టమర్లను ఆకట్టుకునేందుకు కుర్చీపైనే డ్యాన్స్!..వీడియో వైరల్

X Image

గ్రామాల్లోకి ప్లాస్టిక్ సామాన్లు అమ్మేందుకు వచ్చే విక్రయదారులు కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ప్లాస్టిక్ కుర్చీల విషయంలో మాత్రం కొనుగోలుదారులకు ఎన్నో సందేహాలు ఉంటాయి. అవి త్వరగా విరిగిపోతాయేమోనన్న భయంతో కొనుగోలు చేసేందుకు కొందరు వెనుకాడుతుంటారు.

అందుకే కుర్చీల విక్రయదారులు వాటి మన్నికను కస్టమర్లకు ప్రత్యక్షంగా చూపిస్తుంటారు. కుర్చీని నేలకేసి కొట్టడం, అటూఇటూ వంచడం వంటి విన్యాసాలు చేస్తూ ఎంత బలంగా ఉన్నాయో వివరిస్తుంటారు. దీంతో కస్టమర్లు కూడా కుర్చీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు.

అయితే ఈ విక్రయదారుడు మాత్రం అందరికంటే ఓ అడుగు ముందుకేశాడు. కస్టమర్ల దృష్టిని ఆకర్షించేందుకు ఏకంగా ప్లాస్టిక్ కుర్చీపై నిలబడి డ్యాన్స్ చేశాడు. అంతేకాదు కాళ్లతోనే కుర్చీని ముందుకు కదుపుతూ తన విన్యాసాలను ప్రదర్శించాడు.

ఇంత చేసినా కుర్చీ మాత్రం చెక్కుచెదరలేదు. దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ‘కుర్చీలందరూ ఈ ప్లాస్టిక్ కుర్చీ వేరయా’ అన్నట్టుగా తనదైన శైలిలో విక్రయదారుడు కుర్చీ బలాన్ని చాటిచెప్పాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విక్రయదారుడి వినూత్న మార్కెటింగ్ స్టంట్ చూసి నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు