కేసీఆర్‌ 2004 ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో ఎక‌రం కూడా లేద‌న్న‌డు.. ఇప్పుడు వేల కోట్ల భూములెలా వ‌చ్చాయ్‌?..పొంగులేటి

2004 కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్ తనకు ఒక్క ఎకరం భూమి కూడా లేదని పేర్కొన్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం వేల కోట్ల విలువైన భూములు, ఆస్తులు ఎలా సమకూరాయో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవిట్‌ల ఆధారంగానే కేసీఆర్ ఆస్తుల పెరుగుదలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొంటూ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.

17 సెప్టెంబర్, 2026 5:30 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కేసీఆర్‌ 2004 ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో ఎక‌రం కూడా లేద‌న్న‌డు.. ఇప్పుడు వేల కోట్ల భూములెలా వ‌చ్చాయ్‌?..పొంగులేటి

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (జనవాణి): బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆస్తులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 2004 కరీంనగర్‌ లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్‌ తనకు ఒక్క ఎకరం భూమి కూడా లేదని పేర్కొన్నారని తెలిపారు. అలాంటప్పుడు ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములు, ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

ఎన్నికల అఫిడవిట్‌లలో నమోదైన వివరాలను పరిశీలిస్తే తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తర్వాత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కేసీఆర్‌ ఆస్తులు భారీగా పెరిగిన విషయం స్పష్టమవుతుందని పొంగులేటి పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు, పేదలు, దళితులకు చెందిన అసైన్డ్‌ భూములను దోచుకోవడం వల్లే ఈ ఆస్తులు సమకూరాయా? అని ప్రశ్నించారు.

సున్నా ఎకరాల నుంచి వేల కోట్ల విలువైన ఆస్తులకు కేసీఆర్‌ ఎదిగారని ఆరోపించిన మంత్రి.. ఎన్నికల అఫిడవిట్‌ల ఆధారంగానే కల్వకుంట్ల కుటుంబంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు అప్పులు, కష్టాలు మిగిలితే కేసీఆర్‌ కుటుంబానికి మాత్రం లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు.

కేసీఆర్‌కు పుట్టుకతోనే వందల ఎకరాల భూమి ఉందంటూ కేటీఆర్‌ చెబుతున్నారని ప్రస్తావించిన పొంగులేటి ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఇచ్చారా? లేక ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఆయన స్పందించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు