#Ponguleti Srinivas Reddy

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Ponguleti Srinivas Reddy.

18 Stories

Stories tagged with #Ponguleti Srinivas Reddy

ఈడీ ఆఫీస్ వద్ద హైటెన్షన్: పొంగులేటిపై చర్యలు ఎందుకు లేవు? EDని నిలదీసిన BRS
news,politics,telangana

ఈడీ ఆఫీస్ వద్ద హైటెన్షన్: పొంగులేటిపై చర్యలు ఎందుకు లేవు? EDని నిలదీసిన BRS

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన ప్రాంతాల్లో 2024 సెప్టెంబర్ 27న జరిగిన ED సోదాలకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా బీఆర్ఎస్ నిరసనకు దిగింది. సోదాల్లో ఏం గుర్తించారు, ఏం స్వాధీనం చేసుకున్నారు, కేసులో ఇప్పటివరకు ఏం పురోగతి సాధించారో వెల్లడించాలని EDని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ED కార్యాలయం వద్ద నోట్ల కట్టలపై పొంగులేటి కూర్చున్నట్లుగా రూపొందించిన కటౌట్‌ను ప్రదర్శించారు. ఇదే అంశంపై కేటీఆర్ కూడా స్పందిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ తీరుపై ప్రశ్నలు సంధించారు.

28 సెప్టెం, 20262 min read
కేసీఆర్‌ 2004 ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో ఎక‌రం కూడా లేద‌న్న‌డు.. ఇప్పుడు వేల కోట్ల భూములెలా వ‌చ్చాయ్‌?..పొంగులేటి
news,politics,telangana

కేసీఆర్‌ 2004 ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో ఎక‌రం కూడా లేద‌న్న‌డు.. ఇప్పుడు వేల కోట్ల భూములెలా వ‌చ్చాయ్‌?..పొంగులేటి

2004 కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్ తనకు ఒక్క ఎకరం భూమి కూడా లేదని పేర్కొన్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం వేల కోట్ల విలువైన భూములు, ఆస్తులు ఎలా సమకూరాయో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవిట్‌ల ఆధారంగానే కేసీఆర్ ఆస్తుల పెరుగుదలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొంటూ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.

17 సెప్టెం, 20261 min read
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
news,politics,telangana

ధరణి సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు..కేసీఆర్‌ పాలనపై అసెంబ్లీలో పొంగులేటి తీవ్ర ఆరోపణలు

తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ పేదలు, రైతులు, భూయజమానులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ధరణి సమస్యలను అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు పలుమార్లు మాజీ సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని విమర్శించారు. ధరణిలోని సాంకేతిక లోపాలు, ‘సీక్రెట్‌ లాక్‌’ల వ్యవస్థ, భూ రికార్డుల సమస్యలపై శాసనసభలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

12 సెప్టెం, 20262 min read
వీరప్పన్‌ను అటవీ మంత్రిని చేస్తే ఎలా ఉంటుందో.. రేవంత్‌ను సీఎంను చేస్తే అట్లనే ఉంది: కేటీఆర్
news,politics,telangana

వీరప్పన్‌ను అటవీ మంత్రిని చేస్తే ఎలా ఉంటుందో.. రేవంత్‌ను సీఎంను చేస్తే అట్లనే ఉంది: కేటీఆర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలోని భూములను కాజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి పథకం వెనుక ఓ స్కామ్ ఉందని విమర్శించారు. 22ఏ నిషేధిత భూముల అంశంపై హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ముఖ్యనేతలతో సమావేశమైన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు.

11 సెప్టెం, 20262 min read
కాంగ్రెస్ ప్రభుత్వం ‘సర్కస్ కంపెనీ’లా మారింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ ఫైర్
news,politics,telangana

కాంగ్రెస్ ప్రభుత్వం ‘సర్కస్ కంపెనీ’లా మారింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ ఫైర్

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ‘వైట్ కాలర్ క్రిమినల్’, రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతున్న వ్యక్తిగా ఆరోపించిన ఆయన.. సీఎం రేవంత్ రెడ్డిపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ‘సర్కస్ కంపెనీ’లా మారిపోయిందని విమర్శించారు.

3 సెప్టెం, 20262 min read
AI Image
news,telangana

ఇందిరమ్మ టవర్స్‌ లక్కీడ్రాలో అద్భుతం.. టోకెన్‌ తీసిన బాలుడి కుటుంబానికే ఫ్లాట్‌

హైదరాబాద్‌ ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్ల కేటాయింపు లక్కీడ్రాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రాజేంద్రనగర్‌ నియోజకవర్గం మైలార్‌దేవుపల్లి పరిధిలో ఓ బాలుడు లక్కీడ్రా టోకెన్‌ తీయగా.. అదే టోకెన్‌ అతడి కుటుంబానికి రావడంతో అక్కడ ఆనందం వెల్లివిరిసింది. జరపుల లక్ష్మీ కుటుంబానికి సొంతింటి అదృష్టం దక్కింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

28 ఆగ, 20261 min read
పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ టవర్స్‌.. 8 వేల ఫ్లాట్లకు లక్కీడ్రా
news,telangana

పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ టవర్స్‌.. 8 వేల ఫ్లాట్లకు లక్కీడ్రా

హైదరాబాద్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్ల కేటాయింపునకు లక్కీడ్రా ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఫ్లాట్‌ పొందిన వారికి రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని, పదేళ్ల తర్వాత అవసరమైతే ఇంటిని విక్రయించుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు.

28 ఆగ, 20263 min read
22A భూములపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. 98% దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్?
telangana,news

22A భూములపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. 98% దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్?

తెలంగాణలో 22A నిషేధిత జాబితా నుంచి భూములను మినహాయించేందుకు వచ్చిన దరఖాస్తుల్లో 98 శాతం వరకు అర్హమైనవేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

25 ఆగ, 20262 min read
ఇందిరమ్మ ఇళ్లపై కేంద్రం జాప్యం.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు ఆపం: పొంగులేటి
telangana,news

ఇందిరమ్మ ఇళ్లపై కేంద్రం జాప్యం.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు ఆపం: పొంగులేటి

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. PMAY-G కింద కేంద్రం నుంచి ప్రతి ఇంటికి రావాల్సిన రూ.72 వేల నిధుల్లో జాప్యం జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

22 ఆగ, 20262 min read
Janavaani Image
news,telangana

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇల్లు కూడా నిషేధిత జాబితాలోనే ఉంది..హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితా వ్యవహారం రాజకీయంగా వేడెక్కింది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇల్లు కూడా 22ఏ నిషేధిత జాబితాలో ఉందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

17 ఆగ, 20262 min read
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి-మంత్రి పొంగులేటిని కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు
news,politics,telangana

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి-మంత్రి పొంగులేటిని కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు కోరారు. పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

17 ఆగ, 20262 min read
రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జిల్లా సబ్‌ రిజిస్ట్రార్లతో సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
news,telangana

నిషేధిత భూములపై ఆందోళన వద్దు.. అర్హులకు న్యాయం చేస్తాం: పొంగులేటి కీలక వ్యాఖ్యలు

22ఎ/పీఓబీ నిషేధిత భూముల జాబితాలో ఉన్న ఆస్తులపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని చెప్పారు. ఈ నెల 14లోగా సంబంధిత డాక్యుమెంట్లన్నీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.

11 ఆగ, 20262 min read
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు.. ఆగస్టు 15 వరకు అవకాశం
district,news,telangana

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు.. ఆగస్టు 15 వరకు అవకాశం

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌ పథకానికి దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం మరో ఐదు రోజులు పొడిగించింది. ఆగస్టు 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పటివరకు 46,121 దరఖాస్తులు అందినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

11 ఆగ, 20262 min read
చిన్నారులకు గుడ్‌న్యూస్.. నిమ్స్‌లో ఆగస్టు 13 నుంచి ఉచిత గుండె శస్త్రచికిత్సలు
health,hospitality-accommodation,news,telangana

చిన్నారులకు గుడ్‌న్యూస్.. నిమ్స్‌లో ఆగస్టు 13 నుంచి ఉచిత గుండె శస్త్రచికిత్సలు

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. ఆగస్టు 13 నుంచి వారం రోజుల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

11 ఆగ, 20262 min read
హైదరాబాద్ పేదలకు గుడ్‌న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పొడిగింపు
news,telangana

హైదరాబాద్ పేదలకు గుడ్‌న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పొడిగింపు

హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆగస్టు 10తో ముగియాల్సిన దరఖాస్తుల గడువును పొడిగించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన చేశారు.

11 ఆగ, 20262 min read
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
news,telangana

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా సొంతింటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, అర్హులందరికీ ఇళ్లు అందే వరకు కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు.

10 ఆగ, 20263 min read
గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక
news,telangana

గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. 53 అడుగులు దాటిన నీటిమట్టం శనివారం ఉదయానికి 55.1 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా, రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

1 ఆగ, 20262 min read
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( ఫైల్ ఫొటో)
news,telangana

రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

30 జులై, 20262 min read