కాకా వెంకటస్వామి కలను సాకారం చేస్తాం.. ప్రాణహిత-చేవెళ్లపై ఎంపీ వంశీకృష్ణ కీలక ప్రకటన

ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్ ప్రాంతాల్లో సాగునీటి కొరతను తీర్చేందుకు దివంగత కాకా వెంకటస్వామి కన్న కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మహారాష్ట్రకు సంబంధించిన అంశాలు, అవసరమైన అనుమతులు, సాంకేతిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.

30 సెప్టెంబర్, 2026 3:33 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కాకా వెంకటస్వామి కలను సాకారం చేస్తాం.. ప్రాణహిత-చేవెళ్లపై ఎంపీ వంశీకృష్ణ కీలక ప్రకటన

MP Gaddam Vamshikrishna | సెప్టెంబర్ 30 (జనవాణి): ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్ ప్రాంతాల్లో సాగునీటి కొరతను తీర్చేందుకు దివంగత కాకా వెంకటస్వామి కన్న కలను సాకారం చేసేందుకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. సుమారు 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలన్నది కాకా వెంకటస్వామి ఆశయమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి కలసి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు ఎంపీ తెలిపారు.

మహారాష్ట్ర అంశాలు, అనుమతులపై ప్రత్యేక దృష్టి

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి మహారాష్ట్రకు సంబంధించిన కొన్ని అంశాలు, అవసరమైన అనుమతులు, ఇతర సాంకేతిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని వంశీకృష్ణ తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర జల సంఘం (CWC) ప్రత్యేక సమావేశం నిర్వహించి, మహారాష్ట్రతో ఉన్న అంశాలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అవసరమైన అనుమతులను త్వరితగతిన పొందేలా కేంద్రంతో సమన్వయం చేసుకుంటామని వెల్లడించారు. కాకా వెంకటస్వామి కలను సాకారం చేయడం కోసం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.

ఉత్తర తెలంగాణ రైతులకు ప్రయోజనం చేకూరేలా..

ఆదిలాబాద్ ప్రాంతానికి అవసరమైన సాగునీటి సౌకర్యాలను అందించడమే తమ లక్ష్యమని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ఉత్తర తెలంగాణ రైతాంగానికి ప్రయోజనం చేకూరేలా ప్రాజెక్టు పురోగతికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య సమన్వయంతో పనిచేస్తామని చెప్పారు. కాకా వెంకటస్వామి ఆశయాలకు అనుగుణంగా ఆదిలాబాద్ ప్రాంతానికి సాగునీరు అందించే దిశగా నిరంతరం కృషి చేస్తామని ఎంపీ పేర్కొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు