రుద్రంగి పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సిరిసిల్ల ఎస్పీ

గ్రామీణ ప్రాంత ప్రజలు, యువతలో సైబర్‌ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, గంజాయి వంటి మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్‌ బి. గితే పోలీసు అధికారులను ఆదేశించారు.

4 ఆగస్టు, 2026 2:54 PM•ByRalin

Share this article

రుద్రంగి పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సిరిసిల్ల ఎస్పీ

రుద్రంగి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి గీతే

రుద్రంగి, ఆగస్టు 4: గ్రామీణ ప్రాంత ప్రజలు, యువతలో సైబర్‌ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, గంజాయి వంటి మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్‌ బి. గితే పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం రుద్రంగి పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన స్టేషన్‌లోని రికార్డులు, కేసుల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది విధుల నిర్వహణ తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా సేవలు అందించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత పటిష్ఠం చేయాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, గంజాయి వ్యాపారం, పేకాట, ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) బియ్యం అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

గ్రామాలను తరచూ సందర్శిస్తూ ప్రజలు, యువతకు సైబర్‌ మోసాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. అలాగే 'నేను సైతం' కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని, నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల ప్రాధాన్యాన్ని వివరించి వాటి ఏర్పాటులో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. తనిఖీల సందర్భంగా ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్‌, ఎస్‌ఐ మోతీలాల్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు