సిరిసిల్ల పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తన హోటల్ వ్యాపారం, కుటుంబ ఆస్తులపై సీఎం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తన హోటళ్లకు ఉచిత ప్రచారం కల్పించినందుకు ధన్యవాదాలు అంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో కేసీఆర్, రేవంత్‌రెడ్డి కుటుంబాల ఆస్తులపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సిరిసిల్ల తీవ్ర సమస్యలకు కేంద్రంగా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సిరిసిల్లను ‘సిరుల సిల్ల’గా కాకుండా ‘ఉరిసిల్ల’గా మార్చారని ఆరోపించారు. సిరిసిల్ల కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు, ఆత్మహత్యలు, గల్ఫ్ వలసలపై మాజీ మంత్రి కేటీఆర్‌ను సీఎం ప్రశ్నించారు.
గ్రామీణ ప్రాంత ప్రజలు, యువతలో సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, గంజాయి వంటి మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులను ఆదేశించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు మంగళవారం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నార్కోటిక్ జాగిలం సహాయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఫేస్‌బుక్ ద్వారా మహిళలతో పరిచయం పెంచుకుని లైంగిక వేధింపులు, బెదిరింపులు, డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఎస్సై కదిరే శ్రీకాంత్‌ను హనుమకొండ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు జిల్లాలో పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ విజయవంతంగా ముగిసింది. ప్రత్యేక తనిఖీల్లో జిల్లావ్యాప్తంగా 104 మంది బాలబాలికలను గుర్తించి సంరక్షణ కల్పించామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్దబజార్‌లో గురువారం భారీ వేపచెట్టు ఒక్కసారిగా నేలకూలింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రగుడు జంక్షన్‌ను రూ.3.22 కోట్లతో అభివృద్ధి చేసి సుందరీకరించడంతో పాటు బస్ షెల్టర్ల నిర్మాణానికి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం శంకుస్థాపన చేశారు.
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న క్షేత్రంలో రూ.1.10 కోట్లతో ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి పనులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం శంకుస్థాపన చేశారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.99.40 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే కొనసాగుతున్న పనులకు ఈ నిధులు తోడవడంతో ఆలయ అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.