రేషన్ కార్డుదారులకు అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే మీ కార్డు రద్దు..!

రేషన్ కార్డుదారులకు కీలక సమాచారం. వరుసగా ఆరు నెలలపాటు రేషన్ తీసుకోని కార్డులను తాత్కాలికంగా ఇనాక్టివ్ చేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుండగా, సంబంధిత లబ్ధిదారులకు ఈకేవైసీ పూర్తి చేసుకునేందుకు గడువు ఇవ్వనున్నారు. రేషన్ కార్డు ప్రయోజనాలు కొనసాగాలంటే ఈకేవైసీ పూర్తి చేసుకోవడం కీలకంగా మారింది.

3 అక్టోబర్, 2026 5:33 PM•ByNarender Kumar Nangunoori

Share this article

రేషన్ కార్డుదారులకు అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే మీ కార్డు రద్దు..!

రేషన్ కార్డుదారులకు అలర్ట్: దేశవ్యాప్తంగా రేషన్ కార్డుల డేటాను ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వరుసగా ఆరు నెలలుగా రేషన్ తీసుకోని రేషన్ కార్డులను తాత్కాలికంగా ఇనాక్టివ్ చేయనున్నట్లు సమాచారం. అక్టోబర్ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

6 నెలలు రేషన్ తీసుకోకపోతే..

కొంతమంది రేషన్ కార్డు ఉన్నప్పటికీ వరుసగా రేషన్ తీసుకోవడం లేదు. దీంతో వారి పేర్లపై కేటాయించే రేషన్ సరుకులు వినియోగం కాకపోవడంతో అక్రమాలకు అవకాశం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల వివరాలను పరిశీలించి, ఎక్కువ కాలంగా రేషన్ తీసుకోని కార్డులను తాత్కాలికంగా నిలిపివేసే చర్యలు చేపట్టనున్నారు. అయితే కార్డును వెంటనే పూర్తిగా రద్దు చేయకుండా ఇనాక్టివ్ చేసే అవకాశం ఉంది. సంబంధిత లబ్ధిదారులు నిర్ణీత గడువులో ఈకేవైసీ పూర్తి చేసుకుంటే కార్డును మళ్లీ యాక్టివేట్ చేసే అవకాశం ఉంటుంది.

1.58 కోట్ల కార్డులపై ప్రభావం?

అక్టోబర్ నుంచి దాదాపు 1.58 కోట్ల రేషన్ కార్డులను ఇనాక్టివ్ చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ కార్డుల్లోని పేర్లను వెంటనే డేటా నుంచి తొలగించకుండా లబ్ధిదారులకు సుమారు మూడు నెలల గడువు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఈకేవైసీ పూర్తి చేసుకున్నవారి కార్డులను తిరిగి యాక్టివేట్ చేయనున్నారు. మరణించిన వ్యక్తులు, డూప్లికేట్ పేర్లు, నకిలీ లబ్ధిదారులను గుర్తించి తొలగించడం కూడా ఈ డేటా ప్రక్షాళనలో భాగంగా ఉంది.

రేషన్ కార్డు సురక్షితంగా ఉండాలంటే..

రేషన్ కార్డుదారులు తమ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవడం ముఖ్యమని అధికారులు సూచిస్తున్నారు. ఈకేవైసీ పూర్తయితే లబ్ధిదారుల వివరాలు ధ్రువీకరించబడతాయి. తద్వారా అర్హులైన వారికి రేషన్ పథకం ప్రయోజనాలు కొనసాగేందుకు అవకాశం ఉంటుంది.

ఈకేవైసీ ఎలా పూర్తి చేయాలి?

కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ‘మేరా రేషన్’ యాప్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. రేషన్ కార్డు నంబర్‌ను నమోదు చేసి, ఆధార్ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అలాగే సమీపంలోని మీ సేవా కేంద్రం లేదా కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కు వెళ్లి కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి రేషన్ కార్డు ఉన్నవారు తమ ఈకేవైసీ స్థితిని ఒకసారి పరిశీలించుకోవడం మంచిది. ముఖ్యంగా చాలా కాలంగా రేషన్ తీసుకోని వారు ఆలస్యం చేయకుండా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడం ద్వారా కార్డు ఇనాక్టివ్ అయ్యే పరిస్థితిని నివారించుకోవచ్చు.

గమనిక: కార్డులను ఇనాక్టివ్ చేసే తేదీలు, గడువు, ప్రభావిత కార్డుల సంఖ్య వంటి వివరాలు రాష్ట్రాల అమలు విధానం ఆధారంగా మారవచ్చు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు