మీ ఆస్తులు బయటపెడతా..లెక్క తేలుస్తా!..కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ధైర్యముంటే కుటుంబానికి చెందిన మొత్తం ఆస్తుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. హైటెక్ సిటీ సమీపంలోని స్టార్ హోటళ్లతో పాటు అమెరికా, సింగపూర్‌లో పెట్టుబడులపై కూడా రేవంత్ ప్రశ్నలు సంధించారు.

30 సెప్టెంబర్, 2026 8:57 PM•ByNarender Kumar Nangunoori

Share this article

మీ ఆస్తులు బయటపెడతా..లెక్క తేలుస్తా!..కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

సిరిసిల్లా,సెప్టెంబర్ 30 (జనవాణి): కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి చెందిన మొత్తం ఆస్తుల వివరాలను బహిర్గతం చేస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ వద్ద ఎలాంటి ఆస్తులు లేవని చెప్పగలరా అంటూ ప్రశ్నించారు.

గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వ్యక్తుల పేరిట ఉన్న వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, భూములు కేవలం ఆరు నెలల వ్యవధిలోనే కేసీఆర్ కుటుంబ సభ్యుల పేరిటకు ఎలా బదిలీ అయ్యాయో వివరించాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

అదే సమయంలో హైటెక్ సిటీ సమీపంలో కేసీఆర్ కుటుంబం పేరుతో స్టార్ హోటళ్లు లేవని చెప్పగలరా? అని సవాల్ చేశారు. అవి ఉన్నాయని తాను నిరూపిస్తానని, అలా నిరూపించలేకపోతే తన పేరును మార్చుకుంటానని సీఎం వ్యాఖ్యానించారు.

కేసీఆర్ కుటుంబానికి అమెరికా, సింగపూర్ వంటి దేశాల్లో భారీగా పెట్టుబడులు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అలాగే దుబాయ్ పాస్‌పోర్ట్ బ్రోకర్ కుమారుడి వద్దకు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబ ఆస్తులపై పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని మరోసారి సవాల్ చేసిన రేవంత్ రెడ్డి ఆస్తుల వివరాలను ప్రజల ముందు ఉంచాలని కోరారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు