పెళ్లి అయినా.. పండుగ అయినా.. ఏ వేడుక అయినా డప్పుల దరువు వినిపిస్తే చాలు అక్కడ సందడి మొదలవుతుంది. ఇక ఆ మాస్ బీట్‌కు ఓ రోబోట్ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో అందుకు సమాధానంగా నిలుస్తోంది.
ఓ ఈవెంట్ ప్రాంగణం ముందు ఎర్ర తివాచీ పరిచి, చుట్టూ రంగురంగుల బెలూన్లతో అలంకరించారు. పక్కనే డ్రమర్లు డ్రమ్స్, సింబల్స్ వాయిస్తుండగా నీలం, నారింజ రంగు స్పోర్టీ టీ-షర్ట్, నల్లటి షార్ట్స్, హెల్మెట్ ధరించిన ఓ రోబోట్ అక్కడికి వచ్చింది. డ్రమ్స్ మోగడం ప్రారంభించగానే రోబోట్ తనదైన స్టైల్‌లో డ్యాన్స్ మొదలుపెట్టింది. ప్రతి బీట్‌కు అనుగుణంగా చేతులు, కాళ్లు, నడుమును కదుపుతూ అదిరిపోయే స్టెప్పులు వేసింది. డ్రమ్స్ మ్యూజిక్ మారినప్పుడల్లా దానికి తగ్గట్టుగా తన కదలికలు, టైమింగ్‌ను మార్చడం వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కొన్ని సందర్భాల్లో భాంగ్రా తరహా చేతి కదలికలు చేస్తూ మరికొన్ని సందర్భాల్లో వంగుతూ, తిరుగుతూ రోబోట్ వేసిన స్టెప్పులు అక్కడున్న వారిని ఆకట్టుకున్నాయి. డప్పుల దరువుకు రోబోట్ కూడా మాస్ స్టెప్పులతో స్పందించడంతో ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ‘ఇకపై డ్యాన్సర్లకు కొదవే లేదు’, ‘రోబోట్ డ్యాన్స్ చూస్తుంటే చిట్టి రోబో గుర్తుకొస్తున్నాడు’, ‘మాస్ బీట్‌కు రోబోట్ డ్యాన్స్ అదుర్స్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Loading Tweet...




















