శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం.. టేకాఫ్‌కు ముందు ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు ప్రయాణికుడి యత్నం

హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తీవ్ర కలకలం రేగింది. కడపకు బయల్దేరిన ఇండిగో విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన క్యాబిన్‌ సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ప్రయాణికుడిని విమానం నుంచి దించి పోలీసులకు అప్పగించారు.

2 అక్టోబర్, 2026 3:06 PM•ByNarender Kumar Nangunoori

Share this article

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం.. టేకాఫ్‌కు ముందు ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు ప్రయాణికుడి యత్నం

హైదరాబాద్, అక్టోబర్ 2 (జనవాణి): హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు)లో ఓ ప్రయాణికుడి చర్య తీవ్ర కలకలం రేపింది. కడపకు వెళ్లాల్సిన ఇండిగో విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు ప్రయత్నించాడు.

విమానం రన్‌వేపైకి వెళ్తున్న సమయంలో ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ వద్దకు వెళ్లి దాన్ని తెరిచేందుకు యత్నించినట్లు సమాచారం. దీనిని గమనించిన క్యాబిన్‌ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. దీంతో ప్రమాదకర పరిస్థితి తలెత్తకుండా నివారించారు. అయితే ప్రయాణికుడి ప్రవర్తనతో విమానంలోని ఇతర ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పరిస్థితిని అదుపులోకి తీసుకున్న సిబ్బంది అనంతరం సదరు ప్రయాణికుడిని విమానం నుంచి దించి పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు ఎందుకు ప్రయత్నించాడనే అంశంపై విచారణ కొనసాగుతోంది. అతడు మద్యం మత్తులో ఉన్నాడా? లేదా మరేదైనా కారణంతో ఈ చర్యకు పాల్పడ్డాడా? అనే కోణాల్లో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు