
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం.. టేకాఫ్‌కు ముందు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయాణికుడి యత్నం
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తీవ్ర కలకలం రేగింది. కడపకు బయల్దేరిన ఇండిగో విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన క్యాబిన్ సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ప్రయాణికుడిని విమానం నుంచి దించి పోలీసులకు అప్పగించారు.

