అర్చకుల సంక్షేమ అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న కమిటీ

తెలంగాణలోని హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అర్చకులు, గిరిజన అర్చకుల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశం నిర్వహించింది. ధూపదీప నైవేద్య (డీడీఎన్) భత్యం పెంపుతో పాటు పలు సంక్షేమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కమిటీ హామీ ఇచ్చింది.

23 జులై, 2026 1:37 PM•ByNarender Kumar Nangunoori

Share this article

అర్చకుల సంక్షేమ అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న కమిటీ

హైదరాబాద్ (తెలంగాణ), జూలై 22: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ (జీవో నెం. 679) ముఖాముఖి సమీక్షల కార్యక్రమంలో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) వద్ద రాష్ట్రవ్యాప్తంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అర్చకులు, గిరిజన అర్చకుల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది.

ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, మోతె శోభన్ రెడ్డి, ఎస్. రాములు నాయక్ పాల్గొని అర్చకుల ప్రతినిధులు సమర్పించిన వినతిపత్రాలను స్వీకరించారు.

సమావేశంలో తెలంగాణ ఉద్యమంలో ఆలయాల ద్వారా ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను చైతన్యపరిచిన అర్చకులు, గిరిజన అర్చకుల సేవలను కమిటీ సభ్యులు అభినందించారు.

ఈ సందర్భంగా అర్చక సంఘాల ప్రతినిధులు ధూపదీప నైవేద్యం (DDN) భత్యం పెంపు, అర్చకుల పిల్లలకు ఉచిత వేద విద్యతో పాటు సాధారణ విద్య, నిరుపేద అర్చక కుటుంబాలకు 250 గజాల నివాస స్థలం, కుటుంబాలకు ప్రత్యేక డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయాలని ప్రధానంగా విజ్ఞప్తి చేశారు.

ఈ డిమాండ్లపై స్పందించిన కమిటీ సభ్యులు, అర్చకులు లేవనెత్తిన అన్ని అంశాలు సమంజసమైనవేనని పేర్కొన్నారు. సమాచార, పౌర సంబంధాల శాఖ (I&PR) ఆధ్వర్యంలో ప్రతి వినతిని నమోదు చేశామని, వాటిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు