తెలంగాణలో SIR ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. వివిధ కారణాలతో సుమారు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.

17 ఆగస్టు, 2026 6:41 PM•ByNarender Kumar Nangunoori

Share this article

తెలంగాణలో SIR ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి

Social Media Image

హైదరాబాద్, ఆగస్టు 17 (జనవాణి): తెలంగాణలో SIR ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. SIR ప్రక్రియలో తొలి దశ పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 78.30 శాతం ఎన్యూమరేషన్ పత్రాలు అందినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఎన్యూమరేషన్ ప్రక్రియలో 2.73 శాతం మంది ఓటర్లు మరణించినవారిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు సుమారు 60 లక్షల మంది అనామలీస్ ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. అలాగే 32 లక్షల మంది ఓటర్లు మ్యాపింగ్ చేసుకోలేదని తెలిపారు.

ఈ నేపథ్యంలో వివిధ కారణాలతో సుమారు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు సంబంధిత పత్రాలను సమర్పించి తమ వివరాలను నిర్ధారించుకోవాలని సూచించారు. నోటీసులు ఎందుకు జారీ చేశామనే కారణాన్ని స్పష్టంగా తెలియజేస్తామని తెలిపారు. ఓటు తొలగింపుపై అభ్యంతరాలు ఉన్నవారు నిర్ణీత సమయంలో తమ అభ్యంతరాలను సమర్పించవచ్చని అధికారులు పేర్కొన్నారు.

అభ్యంతరాల స్వీకరణ

ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు అభ్యంతరాలు, సంబంధిత దరఖాస్తులను పరిశీలించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు సుదర్శన్‌రెడ్డి తెలిపారు. SIR ప్రక్రియను పూర్తి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మందికి పైగా అధికారులు పాల్గొంటారని వెల్లడించారు. SIR ముసాయిదా ఓటర్ల జాబితా కోసం సంబంధిత అధికారిక ఎన్నికల పోర్టల్‌ను పరిశీలించండి.

సర్ జాబితా ముసాయిదా కోసం ఈ క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.

https://voters.eci.gov.in/download-eroll?stateCode=S29

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు