సినిమా ప్రమోషన్లు, కమర్షియల్ యాడ్స్‌కు సాధారణంగా దూరంగా ఉండే కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ తాజాగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కోసం చేసిన ఒక్క నిమిషం యాడ్ చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రకటన కోసం ఆయనకు ఏకంగా రూ.40 కోట్ల పారితోషికం అందినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
తమిళనాడు సీఎం, నటుడు విజయ్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. పెట్టుబడుల సేకరణలో భాగంగా లండన్ వెళ్లిన విజయ్.. అక్కడ జరగనున్న మోటార్ రేసింగ్ ఈవెంట్‌కు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ రేసులో హీరో అజిత్ పాల్గొంటుండగా, హీరోయిన్ త్రిష కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో విజయ్, త్రిష మరోసారి ఒకే వేదికపై కనిపిస్తారా అన్న ఆసక్తి నెలకొంది.
చిరంజీవి, శ్రీదేవి నటించిన ఎవర్‌గ్రీన్ క్లాసిక్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’లో కనిపించిన చిన్నారుల్లో షాలిని, షామిలి, రిచర్డ్ రిషి కూడా ఉన్నారనే విషయం తెలుసా? నిజ జీవితంలో తోబుట్టువులైన వీరు చిన్నతనంలోనే సినిమాల్లోకి వచ్చి తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. షాలిని స్టార్ హీరోయిన్‌గా ఎదగగా, షామిలి ‘ఓయ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. రిచర్డ్ రిషి ‘A Film By Aravind’ సహా పలు చిత్రాలతో హీరోగా గుర్తింపు పొందారు. ఈ ముగ్గురి ఆసక్తికర సినీ ప్రయాణం గురించి తెలుసుకోండి.