తమిళనాడు సీఎం, హీరో విజయ్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. పెట్టుబడుల సేకరణ కోసం సెప్టెంబర్ 10 నుంచి 16 వరకు లండన్‌లో పలు పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం కానున్నట్లు సమాచారం. సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్‌కు ఇదే తొలి విదేశీ పర్యటనగా ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం సినిమాలతో పాటు మోటార్ రేసింగ్‌పై కూడా దృష్టి సారిస్తున్నారు. లండన్‌లో శనివారం జరగనున్న మిచెలిన్ లీ మాన్స్ కప్ మోటార్ రేసింగ్ పోటీల్లో అజిత్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు విజయ్ చీఫ్ గెస్ట్‌గా హాజరై గ్రీన్ ఫ్లాగ్ ఊపి రేసును ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఒకే వేదికపై విజయ్, త్రిష?
మరోవైపు హీరోయిన్ త్రిష కూడా ప్రస్తుతం లండన్‌లోనే ఉన్నారు. ఆమె నటిస్తున్న సైకలాజికల్ హారర్ మూవీ షూటింగ్ అక్కడ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అజిత్ పాల్గొనే రేసింగ్ ఈవెంట్‌కు త్రిష కూడా హాజరుకానున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీంతో విజయ్, త్రిష మరోసారి ఒకే వేదికపై కనిపించే అవకాశం ఉందన్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇటీవలే అజిత్‌ను సీనియర్ హీరోయిన్ రాధిక శరత్‌కుమార్ కలిశారు. ఆమెతో పాటు త్రిష కూడా ఉన్నట్లు తెలుస్తోంది. త్రిషతో కలిసి దిగిన సెల్ఫీని రాధిక సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ప్రచారానికి మరింత ఊతం లభించింది.
విజయ్–త్రిషపై కొనసాగుతున్న చర్చ
విజయ్, త్రిష మధ్య సంబంధంపై కొంతకాలంగా తమిళ సినీ వర్గాల్లో పలు రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రచారాలపై విజయ్, త్రిష అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇటీవల విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి త్రిష హాజరుకావడం కూడా చర్చనీయాంశమైంది. అలాగే తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విజయ్ తల్లిదండ్రులతో కలిసి త్రిష కనిపించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు లండన్‌లో అజిత్ మోటార్ రేసింగ్ ఈవెంట్‌కు విజయ్, త్రిష ఇద్దరూ హాజరవుతారనే ప్రచారం జరుగుతుండటంతో.. ఈ ఇద్దరూ నిజంగానే ఒకే వేదికపై కనిపిస్తారా అన్న ఆసక్తి నెలకొంది.




















