దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. మరో పార్టీ బీ-ఫారమ్‌పై ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా పార్టీని వీడినట్లుగా పరిగణించవచ్చని స్పష్టం చేసింది. తిరిగి సొంత పార్టీలో చేరినా చట్టసభ సభ్యత్వంపై పడిన అనర్హత స్వయంచాలకంగా తొలగిపోదని పేర్కొంది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించిన అనర్హత కేసు మరో కీలక మలుపు తిరిగింది. తెలంగాణ హైకోర్టు తనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్‌ను బుధవారం విచారణ జాబితాలో చేర్చేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అంగీకరించారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందించారు. తీర్పును స్వాగతిస్తున్నానని, సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఖైరతాబాద్ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, మళ్లీ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఆయనపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది.