తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ‘వైట్ కాలర్ క్రిమినల్’, రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతున్న వ్యక్తిగా ఆరోపించిన ఆయన.. సీఎం రేవంత్ రెడ్డిపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ‘సర్కస్ కంపెనీ’లా మారిపోయిందని విమర్శించారు.
రాయదుర్గం PM ఏక్తా మాల్ ప్రాజెక్టులో ప్రభుత్వ భూమి, కేంద్ర నిధుల వినియోగం, టెండర్లపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. టెండర్లు రద్దు చేసి సీబీఐ లేదా న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ సంతాపం తెలిపారు.
తెలంగాణ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు, విద్యా వ్యవస్థను అవమానించేలా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై నిరసనలు తెలిపిన విద్యార్థులపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను దేశద్రోహులుగా చిత్రీకరించడం, నిరసనలను అణచివేసేలా మాట్లాడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు.