పాలు లేకుండానే మైదాతో కలాకంద్, మైసూర్ పాక్ తయారు చేస్తున్న ఓ స్వీటు షాపు బండారం బయటపడింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 40 కిలోల కల్తీ స్వీట్లను ధ్వంసం చేసి, 1,300 కిలోల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ ఓల్డ్‌సిటీ మదీనాలోని ప్రముఖ షాదాబ్ కేఫ్‌పై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) అధికారులు చర్యలు తీసుకున్నారు. పారిశుద్ధ్య లోపాలు, అపరిశుభ్ర వాతావరణంలో మాంసం నిల్వ చేయడం, కిచెన్‌లో బొద్దింకలు, ఇతర కీటకాలు సంచరిస్తుండటాన్ని గుర్తించిన అధికారులు FSSAI లైసెన్స్‌ను రద్దు చేసి కేఫ్‌ను సీజ్ చేశారు.