దేశ రాజధాని ఢిల్లీలో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం ఘటన కలకలం రేపింది. కల్కాజీ మందిర్ సమీపంలోని ఆస్థా కుంజ్ పార్కులో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో సమీపంలోని లేడీ శ్రీరామ్ కాలేజీ (LSR) విద్యార్థినుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి సాధారణ తరగతులను రద్దు చేసిన కాలేజీ.. బుధవారం ఆన్‌లైన్ క్లాసులను నిర్వహిస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 17 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు సహా నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడి, అనంతరం కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక మృతదేహాన్ని బహిరంగ ప్రదేశంలో పడేయగా.. కుక్కలు పీక్కుతిన్న స్థితిలో పోలీసులు గుర్తించారు.
ఉత్తరప్రదేశ్‌లోని రుద్రపూర్‌లో 19 ఏళ్ల యువతిని అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టుకునే సమయంలో నిందితులు పోలీసులపై కాల్పులు జరపగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అనంతరం సీన్ రీక్రియేషన్ సందర్భంగా పారిపోవడానికి ప్రయత్నించిన ఇద్దరిని స్థానికులు, పోలీసులు కలిసి పట్టుకున్నారు.