రియల్ ఎస్టేట్ ఆరోపణలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బే తన లక్ష్యమైతే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని, రియల్ ఎస్టేట్ రంగంలోనే కొనసాగి ఉంటే వేల కోట్ల సంపద సంపాదించే అవకాశం ఉండేదని అన్నారు. కోకాపేట, పుప్పాలగూడ, మంచిరేవుల ప్రాంతాలు భవిష్యత్‌లో విలువైనవిగా మారతాయని తాను ముందుగానే గుర్తించినట్లు తెలిపారు.
హైదరాబాద్ భూముల ధరలు మరోసారి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో టీజీఐఐసీ నిర్వహించిన ఈ-వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ.264 కోట్లకు అమ్ముడైంది. మొత్తం 5.25 ఎకరాల ప్లాట్ రూ.1,386 కోట్లకు విక్రయమై.. నగర భూముల ధరల్లో సరికొత్త రికార్డు నమోదైంది.
హైదరాబాద్‌లోని కోకాపేట్ గోల్డెన్ మైల్‌లో ట్రంప్ బ్రాండ్‌తో భారీ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. రెండు 65 అంతస్తుల టవర్లలో 450 లగ్జరీ అపార్ట్‌మెంట్లు నిర్మించనున్నారు. సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ దక్షిణ భారతంలో ట్రంప్ బ్రాండ్‌కు తొలి అడుగుగా నిలవనుంది.
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలే రియల్ ఎస్టేట్ వృద్ధికి నిదర్శనమని పేర్కొంటూ, త్వరలో మూసీ సుందరీకరణ పనులకు టెండర్లు పిలుస్తామని వెల్లడించారు.