భారీ వరదలతో తీవ్రంగా నష్టపోయిన నేపాల్‌కు భారత్ అందిస్తున్న సహాయంపై ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి నిషా మెహతా ప్రశంసలు కురిపించారు. కష్టసుఖాల్లో భారత్ ఎప్పుడూ నేపాల్‌కు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. వరదల్లో మృతి చెందిన వారి గుర్తింపునకు డీఎన్‌ఏ పరీక్షల విషయంలో భారత్ నిపుణుల బృందం అందిస్తున్న సహకారం ఎంతో కీలకంగా మారిందని తెలిపారు.
నేపాల్‌లోని రసువా జిల్లాలో భోటేకోషి నదిలో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో 384 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు నేపాల్ టూరిజం బోర్డు ప్రాథమికంగా వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీ పౌరులు ఉండగా.. విదేశీయుల్లో సుమారు 105 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపింది.