హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహాగణపయ్య నిమజ్జనం ఘనంగా పూర్తైంది. ట్యాంక్‌బండ్ క్రేన్ నంబర్-4 వద్ద పంచముఖ సంకటహర మహాగణపతి విగ్రహాన్ని ప్రత్యేక పూజల అనంతరం గంగమ్మ ఒడికి చేర్చారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ట్యాంక్‌బండ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 12 నుంచి 24వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు.