హైదరాబాద్, సెప్టెంబర్ 11 (జనవాణి): ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు అవసరాన్ని బట్టి ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు అమల్లో ఉంటాయి.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మింట్ కాంపౌండ్ వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించరు. వాహనాలను రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
రాజ్‌దూత్ లేన్ మీదుగా బడా గణేష్ వైపు వెళ్లే వాహనాలను అనుమతించరు. వీటిని రాజ్‌దూత్ లేన్ వద్ద ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
మింట్ కాంపౌండ్ మీదుగా ఐమ్యాక్స్ థియేటర్ వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్‌ను నిలిపివేస్తారు. వాహనాలను మింట్ కాంపౌండ్ లైన్ వద్ద సెక్రటేరియట్ ఎక్స్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
మింట్ కాంపౌండ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను అనుమతించరు. వాహనాలను నెక్లెస్ రోటరీ వద్ద సెక్రటేరియట్ జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు.
ఖైరతాబాద్ పోస్ట్ ఆఫీస్ లేన్ మీదుగా ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు వెళ్లే వాహనాలను అనుమతించరు. వీటిని పోస్ట్ ఆఫీస్ వద్ద పాత పీఎస్ సైఫాబాద్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఉండే అవకాశం
భక్తుల రద్దీ కారణంగా ఖైరతాబాద్, షాదాన్ కాలేజ్, అయోధ్య, నిరంకారి, పాత పీఎస్ సైఫాబాద్, మింట్ కాంపౌండ్, ఎన్టీఆర్ మార్గ్, సెక్రటేరియట్ జంక్షన్, నెక్లెస్ రోటరీ, కేసీపీ జంక్షన్, మాసాబ్ ట్యాంక్ ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ప్రయాణికులు వీలైనంత వరకు ఈ మార్గాలను నివారించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
భక్తుల కోసం పార్కింగ్ స్థలాలు
నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ వైపు నుంచి వచ్చే భక్తులకు:
రేస్ కోర్స్ రోడ్, ఎన్టీఆర్ ఘాట్, ఐమ్యాక్స్ థియేటర్ పక్కన ఉన్న హెచ్‌ఎండీఏ పార్కింగ్ స్థలం, ఐమ్యాక్స్ థియేటర్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం
ఖైరతాబాద్ జంక్షన్ వైపు నుంచి వచ్చే భక్తులకు: విశ్వేశ్వరయ్య భవన్
భక్తుల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ ఆంక్షల్లో మార్పులు చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
అత్యవసర ప్రయాణ సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్: 9010203626ను సంప్రదించవచ్చు.




















