గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపయ్య.. ఘనంగా నిమజ్జనం

హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహాగణపయ్య నిమజ్జనం ఘనంగా పూర్తైంది. ట్యాంక్‌బండ్ క్రేన్ నంబర్-4 వద్ద పంచముఖ సంకటహర మహాగణపతి విగ్రహాన్ని ప్రత్యేక పూజల అనంతరం గంగమ్మ ఒడికి చేర్చారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ట్యాంక్‌బండ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

25 సెప్టెంబర్, 2026 3:42 PM•ByNarender Kumar Nangunoori

Share this article

గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపయ్య.. ఘనంగా నిమజ్జనం

హైదరాబాద్,సెప్టెంబర్ 25 (జనవాణి): ఖైరతాబాద్ మహాగణపయ్య గంగమ్మ ఒడికి చేరుకున్నారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై క్రేన్ నంబర్-4 వద్ద పంచముఖ సంకటహర మహాగణపతి విగ్రహాన్ని ఘనంగా నిమజ్జనం చేశారు. నిమజ్జనానికి ముందు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గంగమ్మ ఒడికి చేర్చారు.

ఖైరతాబాద్ బడా గణేశుడిని చివరిసారి దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ట్యాంక్‌బండ్ పరిసరాలు భక్త జనసంద్రంగా మారాయి. ముఖ్యంగా సెక్రటేరియట్ సౌత్ ఈస్ట్ మార్గంలో భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. రద్దీని నియంత్రించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ganapati

మరోవైపు అప్పర్ ట్యాంక్‌బండ్‌పై వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవాలు అత్యంత కోలాహలంగా కొనసాగుతున్నాయి. జంట నగరాల నుంచి భారీ సంఖ్యలో గణేశ్ విగ్రహాలు నిమజ్జనం కోసం తరలివస్తున్నాయి. మొత్తం 12 క్రేన్ల ద్వారా నిమజ్జన ప్రక్రియ కొనసాగుతోంది. భద్రతా చర్యల్లో భాగంగా పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా 58 సీసీటీవీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ప్రతి క్రేన్ వద్ద ఒక ఎస్‌ఐతో పాటు ఐదుగురు పోలీస్ సిబ్బందిని మోహరించారు. నిమజ్జన ప్రాంతాల్లో 25 క్రైమ్ టీమ్స్, 10 షీ టీమ్స్ విధులు నిర్వహిస్తున్నాయి.

పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అప్పర్ ట్యాంక్‌బండ్ పరిధిలో 479 వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా పూర్తయ్యేలా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు