హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర మాత్రం బాహుబలి క్రేన్‌లో సాంకేతిక సమస్య కారణంగా రెండు గంటలకు పైగా ఆలస్యమైంది. సమస్యను పరిష్కరించిన అనంతరం మహాగణపతిని టస్కర్‌పైకి చేర్చి శోభాయాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటల్లోపు నిమజ్జనం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు.
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి గణేశ్ ఉత్సవాలకు ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో 'పంచముఖ సంకటహర మహాగణపతి’గా కొలువుదీరిన బడా గణేశుడికి తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా తొలి పూజలు నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.