ముఖేశ్ అంబానీ ఇంట వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో అంబానీ కోడలు రాధిక మర్చంట్ ‘ఏకదంతాయ వక్రతుండాయ’ పాటకు చేసిన అద్భుత నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తిరుమల శ్రీవారి భక్తుల రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు రిలయన్స్ సంస్థ టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సులను అందిస్తోంది. వీటిలో తొలి విడతగా 15 బస్సులు తిరుమలకు చేరుకున్నాయి. మరో 10 బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. బస్సులతో పాటు 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్‌ను కూడా రిలయన్స్ సమకూర్చనుంది.
టెలికాం, శీతల పానీయాల మార్కెట్లలో సంచలనం సృష్టించిన రిలయన్స్ ఇప్పుడు ఐస్‌క్రీమ్ రంగంపై దృష్టి పెట్టింది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ‘బాంబే క్రీమరీ’ పేరుతో ఐస్‌క్రీమ్‌లను కేవలం రూ.10 ప్రారంభ ధరతో మార్కెట్లోకి తీసుకొస్తోంది. తక్కువ ధర వ్యూహంతో అమూల్, క్వాలిటీ వాల్స్, మదర్ డైరీ, హావ్‌మోర్ వంటి ప్రముఖ బ్రాండ్లకు పోటీ ఇవ్వాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.