సెప్టెంబర్ 15 (జనవాణి): ముఖేశ్ అంబానీ ఇంట వినాయక చవితి వేడుకలు వైభవంగా జరిగాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో అంబానీ కోడలు రాధిక మర్చంట్ చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘ఏకదంతాయ వక్రతుండాయ’ పాటకు ఆమె సంప్రదాయబద్ధంగా నృత్యం చేసి ఆకట్టుకున్నారు.
రాధిక మర్చంట్ డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఐఫా షేర్ చేసింది. ‘హార్ట్‌ఫెల్ట్ ట్రిబ్యూట్ టు లార్డ్ గణేశా’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. వీడియోలో రాధిక నృత్యంతో పాటు ఆమె ముఖ కవళికలు కూడా ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఆమెతో పాటు మరో నలుగురు మహిళలు కూడా ఈ నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు.
వీడియో చూసిన నెటిజన్లు రాధికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆమె నృత్యం ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. గణేశుడికి ఆమె ఇచ్చిన ఈ నృత్య నివాళి ఎంతో అందంగా ఉందని అభిప్రాయపడుతున్నారు.
రాధిక మర్చంట్ 2024లో ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీని వివాహం చేసుకున్నారు. తనకు చిన్నప్పటి నుంచే డ్యాన్స్‌పై ఆసక్తి ఉందని ఆమె గతంలో వెల్లడించారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఆమె చేసిన ఈ నృత్య ప్రదర్శన మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.
Loading Tweet...




















