సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో జరిగిన అత్యాధునిక ఆయుధాల చోరీ ఘటనపై దర్యాప్తు ముమ్మరమైంది. చోరీ జరిగి నాలుగు రోజులు గడిచినా ఆయుధాల ఆచూకీ లభించకపోవడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రకుట్ర కోణంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో NIA, IB, మిలిటరీ, స్థానిక పోలీసులు కలిసి దర్యాప్తు చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండంలో NIA నిర్వహించిన తనిఖీలు కలకలం రేపాయి. అయోధ్య నగర్‌లో చేపట్టిన సోదాల్లో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతడిని ఎన్‌టీపీసీ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది.