
international,news,tourism
ఈఫిల్ టవర్ మూసివేత...హిందూ ప్రతినిధి బృందం పర్యటనతో వివాదం
పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద మహిళా ఉద్యోగులను విధులకు దూరంగా ఉంచారన్న ఆరోపణలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఓ హిందూ ప్రతినిధి బృందం ప్రైవేట్ పర్యటన సందర్భంగా మహిళా సిబ్బందిని కొన్ని ప్రాంతాల నుంచి తప్పించి, వారి స్థానంలో పురుష ఉద్యోగులను నియమించారని కార్మిక సంఘాలు ఆరోపించాయి. ఈ ఘటనను నిరసిస్తూ సిబ్బంది ఆకస్మిక సమ్మెకు దిగడంతో ఈఫిల్ టవర్ సోమవారం రోజంతా మూసివేయాల్సి వచ్చింది.
8 సెప్టెం, 20262 min read

