Seats Shrink | విమానాల్లో కుచించుకుపోతున్న సీట్లు!

గత నాలుగు దశాబ్దాల్లో విమానాల్లో ఎకానమీ క్లాస్‌ సీట్ల పరిమాణం గణనీయంగా తగ్గింది. ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు విమానయాన సంస్థలు లెగ్‌రూమ్‌, సీటు వెడల్పును కుదిస్తుండగా, ఎక్కువ స్థలం కావాలంటే అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాయి ఎయిర్‌లైన్స్‌.

26 జులై, 2026 7:44 AM•ByPradeep

Share this article

Seats Shrink | విమానాల్లో కుచించుకుపోతున్న సీట్లు!
  • 40 ఏళ్లలో 4-7 అంగుళాలు తగ్గిన లెగ్‌రూమ్‌..

  • ప్రయాణీలకు తీవ్ర ఇబ్బందులు

  • ఎక్కువ స్థలానికి అదనపు చార్జీలు వడ్డింపు

  • భవిష్యత్‌లో నిలబడి ప్రయాణం చేసేలా ఏర్పాట్లు

Seats Shrink | గతంలో విమాన ప్రయాణం అంటే సౌకర్యాలకు మారుపేరుగా ఉండేది. కానీ కాలక్రమేణా ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎక్కువ మంది ప్రయాణికులను ఒకే విమానంలో తీసుకెళ్లడం, నిర్వహణ వ్యయాలను తగ్గించడమే లక్ష్యంగా ఎయిర్‌లైన్‌ కంపెనీలు ఎకానమీ క్లాస్‌లో సీట్ల మధ్య దూరం, సీట్ల వెడల్పును క్రమంగా తగ్గిస్తున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఊబకాయం పెరగడంతో శరీర పరిమాణాలు కూడా అధికమయ్యాయి. ఈ రెండు పరిణామాల ప్రభావంతో ముఖ్యంగా సుదూర విమాన ప్రయాణాలు మరింత ఇబ్బందికరంగా మారాయి. విమానయాన రంగానికి చెందిన నివేదికల ప్రకారం.. 1980, 1990 దశకాల్లో ఎకానమీ క్లాస్‌లో రెండు సీట్ల మధ్య దూరం (సీట్‌ పిచ్‌) 34 నుంచి 35 అంగుళాలు ఉండేది. ప్రస్తుతం చాలా విమానయాన సంస్థల్లో అది 30 నుంచి 31 అంగుళాలకు పడిపోయింది. భారత్‌లోని తక్కువ ధరకే సేవలు అందిస్తున్న సంస్థలకు చెందిన విమానాల్లో 28 నుంచి 29 అంగుళాలకే పరిమితమైంది. దీంతో ప్రయాణికులు ముందుభాగంలో కాళ్లు పెట్టుకునే స్థలం సగటున నాలుగు నుంచి 7 అంగులాలకు పడిపోయింది. సీట్ల వెడల్పులోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో 18.5 నుంచి 19 అంగుళాల వెడల్పు ఉన్న సీట్లు ప్రస్తుతం అనేక విమానాల్లో 16.5 నుంచి 17.5 అంగుళాల మధ్యే ఉన్నాయి. మరోవైపు అప్లైడ్ ఎర్గోనామిక్స్, ఎస్‌ఏఈ ఇంటర్నేషనల్ అధ్యయనం ప్రకారం.. గత నాలుగు దశాబ్దాల్లో కూర్చున్నప్పుడు మనుషుల శరీర వెడల్పు సగటున 8 నుంచి 13 శాతం పెరిగింది.

లెగ్‌రూమ్‌కి అదనపు చార్జీలు..

ప్రస్తుతం చాలా విమానయాన సంస్థలు ఎక్కువ లెగ్‌రూమ్‌ ఉన్న సీట్లకు ప్రత్యేకంగా ఫీజులను వసూలు చేస్తున్నాయి. దేశీయ విమానాల్లో ఇలాంటి సీటు కోసం రూ.500 నుంచి రూ.2,000 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. అంతర్జాతీయ విమానాల్లో మార్గం, డిమాండ్‌ను బట్టి ఈ ఛార్జీ రూ.3వేల నుంచి రూ.10వేల వరకూ ఉంటోంది. ఇటలీకి చెందిన అవియోఇంటీరియర్స్ సంస్థ రూపొందించిన ‘స్కైరైడర్‌ 2.0’ సీటు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇందులో ప్రయాణికులు పూర్తిగా కూర్చోవడం కాకుండా ముందుకు వాలిన భంగిమలో ప్రయాణించాల్సి రావడం గమనార్హం. ఈ విధానాన్ని అమలు చేస్తే ఒకే విమానంలో సుమారు 20 శాతం మంది అదనపు ప్రయాణికులను తీసుకెళ్లే అవకాశం ఉందని సంస్థ చెబుతోంది.

సీట్లలో చాలా మార్పులు..

గత 40 సంవత్సరాల్లో సీట్లలో చాలామార్పులే వచ్చాయి. 1980-90వ దశకంలో సీట్ల మధ్య దూరం 34 నుంచి 35 అంగుళాల వరకు ఉండేది. కానీ, ప్రస్తుతం అది 30 నుంచి 31 అంగుళాలకు పడిపోయింది. కొన్ని విమానాల్లో అయితే 28-29 అంగుళాలు మాత్రమే ఉంటోంది. ఇక సీట్ల వెడెల్పు 1980-90 దశకంలో 18.5 నుంచి 19 అంగులాలు ఉండగా.. ప్రస్తుతం 16.5-7.5గా ఉంటోంది. గతంలో పోలిస్తే విమానాల్లో ప్రస్తుత కాలంలో సీట్ల సంఖ్య చాలానే పెరిగింది. బోయింగ్‌ 737 విమానాల్లో గతంలో 120-130 సీట్లు ఉండగా.. ఇప్పుడది 180-190కి చేరుకుంది. ఇక ఎయిర్‌బస్‌ ఏ320 విమానాల్లో గతంలో దాదాపుగా 150 వరకు ఉండగా.. అది 180-186కి పెరగడం విశేషం.

P

Written By

Pradeep

Reporter

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు