
30 ఏళ్ల నిరీక్షణకు తెర..వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం.. నల్లమల సాగర్‌కు కృష్ణమ్మ పరుగు
మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను జాతికి అంకితం చేశారు. నల్లమల కొండల్లోని జంట సొరంగాల నుంచి వెలువడిన కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతించిన సీఎం.. అనంతరం నల్లమల సాగర్‌కు నీటిని విడుదల చేశారు. తొలి దశలో 10.70 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందించనున్నట్లు తెలిపారు.


