
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇల్లు కూడా నిషేధిత జాబితాలోనే ఉంది..హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితా వ్యవహారం రాజకీయంగా వేడెక్కింది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇల్లు కూడా 22ఏ నిషేధిత జాబితాలో ఉందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


