మతిమరుపుతో తీర్థయాత్ర బృందం నుంచి తప్పిపోయి పొరపాటున బీహార్ రైలు ఎక్కిన పంజాబ్‌కు చెందిన వృద్ధుడు చమన్ లాల్.. ఏకంగా 1,200 కిలోమీటర్ల దూరంలోని గయాకు చేరుకున్నాడు. ఆకలితో, ఆందోళనతో ఉన్న ఆయనకు నీరజ్ అనే స్థానికుడు ఆశ్రయం కల్పించాడు. వృద్ధుడు చెప్పిన గ్రామం ఆచూకీ కోసం చాట్‌జీపీటీని ఆశ్రయించిన నీరజ్ సాంకేతికత సాయంతో ఆయన కుటుంబాన్ని గుర్తించి తిరిగి కలిపాడు.
రోజూ రూ.500 కోసం కష్టపడే ఓ శ్రామికుడి జీవితం ఒక్క గంటలో పూర్తిగా మారిపోయింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మధు సింగ్ పంజాబ్‌లోని బంగా ప్రాంతంలో కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పని ముగించుకుని ఇంటికి వెళ్తూ లాటరీ టికెట్ కొనగా గంటలోనే అతడికి ఏకంగా రూ.3 కోట్ల బహుమతి దక్కింది.
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఓ పెళ్లి వేడుకలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చూపుల సమయంలో తనకు చూపించిన వరుడి ఫొటోలో ఉన్న వ్యక్తి కాకుండా మరో వ్యక్తి పెళ్లికొడుకుగా రావడంతో వధువు షాక్‌కు గురైంది. తనకు చూపించిన ఫొటో వేరు.. పెళ్లి మండపంలో ఉన్న వ్యక్తి వేరని ఆరోపిస్తూ పెళ్లిని నిరాకరించింది. దీంతో ఘనంగా జరగాల్సిన వివాహం అర్థాంతరంగా ఆగిపోయింది.
మహారాష్ట్రలోని నాందేడ్‌లో శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడికి యత్నం కలకలం రేపింది. గురుద్వారా మెట్ల వద్ద ఓ సేవాదార్ అకస్మాత్తుగా కిర్పాన్‌తో ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు నాందేడ్ ఎస్పీ డాక్టర్ నిలాభ్ రోహన్ తెలిపారు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.