జార్ఖండ్‌లోని రాంచీలో ఓ కోతి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మద్యం దుకాణంలోకి ప్రవేశించిన కోతి.. సిబ్బందిపై దాడి చేసిన అనంతరం ఓ మద్యం బాటిల్‌ను తెరిచి తాగింది. ఆ తర్వాత మద్యం మత్తులో బాటిళ్ల మధ్యే పడుకుని నిద్రపోయింది.
ఝార్ఖండ్‌లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో పేపర్ లీకేజీలను నిరసిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉధృతమవుతోంది. నిరసనలకు సంబంధించి పోలీసులు 600 మందిపై కేసులు నమోదు చేయగా, వారిలో 500 మంది గుర్తుతెలియని విద్యార్థులు ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
తెలుగు ప్రేక్షకులను సస్పెన్స్, హారర్ అంశాలతో అలరించిన 'మా ఊరి పొలిమేర' ఫ్రాంచైజీ ఇప్పుడు మూడో భాగంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'పొలిమేర-3' చిత్రాన్ని సికింద్రాబాద్‌లో ఘనంగా ప్రారంభించగా, ఈసారి యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఈ ఫ్రాంచైజీలో భాగం కావడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.