ఝార్ఖండ్‌లో విద్యార్థుల ఉద్యమం ఉధృతం.. 600 మందిపై కేసులు

ఝార్ఖండ్‌లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో పేపర్ లీకేజీలను నిరసిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉధృతమవుతోంది. నిరసనలకు సంబంధించి పోలీసులు 600 మందిపై కేసులు నమోదు చేయగా, వారిలో 500 మంది గుర్తుతెలియని విద్యార్థులు ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

13 ఆగస్టు, 2026 3:43 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఝార్ఖండ్‌లో విద్యార్థుల ఉద్యమం ఉధృతం.. 600 మందిపై కేసులు

Social Media Image

ఝార్ఖండ్‌, ఆగస్టు, 13 (జనవాణి): ఝార్ఖండ్‌లో పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన 20వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ జేపీఎస్‌సీ–జేఎస్ఎస్‌సీ మంచ్ ఆధ్వర్యంలో రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియం వద్ద విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తున్నారు. సోమవారం విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు బ్యాటన్ చార్జ్ చేయడంతో పాటు వాటర్ క్యానన్లు, భాష్పవాయువును ప్రయోగించారు. ఈ ఘటనకు నిరసనగా భారతీయ జనతా పార్టీ (BJP) మరుసటి రోజు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది.

తాజాగా నిరసన కార్యక్రమాలకు సంబంధించి పోలీసులు 600 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో సుమారు 500 మంది గుర్తుతెలియని విద్యార్థులు ఉన్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పేపర్ లీక్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పరీక్షలను రద్దు చేయాలని, సీబీఐ లేదా ఇతర రాష్ట్రాలకు చెందిన మాజీ న్యాయమూర్తులతో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకునే వరకు ఆందోళన విరమించబోమని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు.

ఇదిలా ఉంటే, విద్యార్థుల డిమాండ్స్‌ను ప్రభుత్వం మరో వారంలోపు నెరవేర్చకపోతే తాను నిరాహార దీక్షకు దిగుతానని మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ బుధవారం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా 1,200 యూనివర్సిటీల్లో నిరసనలకు పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ కూడా ప్రకటించింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు