ఝార్ఖండ్‌లో జరిగిన ఓ విచిత్రమైన ఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ కోతి ఏకంగా మద్యం దుకాణంలోకి వెళ్లి అక్కడున్న మద్యం తాగి అదే షాపులో మత్తులో నిద్రపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. రాంచీ సమీపంలోని ఓర్మాంఝి బ్లాక్ చౌక్‌లో ఉన్న ఓ లిక్కర్ షాపులోకి శనివారం ఓ కోతి అకస్మాత్తుగా ప్రవేశించింది. అకస్మాత్తుగా వైన్‌షాప్‌లోకి ప్రవేశించిన కోతిని తరిమికొట్టేందుకు సిబ్బంది ప్రయత్నించారు. అయితే, వారిపై ఆ కోతి తీవ్రంగా దాడి చేసి గాయపరిచింది.
ముందుగా షాపులో కాసేపు అటూ ఇటూ తిరిగిన కోతి ఆ తర్వాత అక్కడున్న ఓ మద్యం బాటిల్‌ను చేతిలోకి తీసుకుంది. బాటిల్‌లోని మద్యాన్ని తాగిన అనంతరం.. ఏమీ జరగనట్టుగా షాపులోని ఓ మూలకు వెళ్లి పడుకుంది.
కోతిని చూసిన షాపు సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ వింత విషయం చుట్టుపక్కల ప్రాంతంలో తెలియడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందం కూడా అక్కడికి చేరుకుని మత్తులో ఉన్న కోతిని సురక్షితంగా బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది.
కోతి మద్యం తాగి అక్కడే నిద్రపోవడం చూసిన స్థానికులు ఆశ్చర్యంతో పాటు నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మొత్తానికి మద్యం షాపులోకి వచ్చిన కోతి.. మద్యం తాగి అదే షాపులో మత్తుగా నిద్రపోవడం ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్‌గా మారింది!
Loading Tweet...




















