
ఆరు గ్యారెంటీలను పక్కనపెట్టి దేవుళ్లపై చర్చ ఎందుకు?: సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్
ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నేత కిషన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాముడు, శివుడి విషయంలో రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టకుండా మతాలు, దేవుళ్ల అంశాలను తెరపైకి తెస్తోందని ఆరోపించారు.



