
హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్.. రూ.70 వేల కోట్ల పెట్టుబడి!
హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకానుంది. టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్‌వాల్ట్, భాగస్వామ్య సంస్థలతో కలిసి రూ.70 వేల కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7 వేల ఉద్యోగాలు లభించనున్నాయి.


