ఢిల్లీ, ఆగస్టు 06 (జనవాణి): ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో తన ఖాతాను ఎందుకు నియంత్రించారని ఆయన ప్రశ్నించారు.
మెటా ఇండియా కార్యాలయ అధికారులను నేరుగా సంప్రదించినప్పటికీ సరైన సమాధానం లభించలేదని కేజ్రీవాల్ తెలిపారు. ఈమెయిల్ ద్వారా పలుమార్లు వివరణ కోరినా సాధారణ రసీదులు మాత్రమే వస్తున్నాయని, సమస్యపై ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. ఇది చాలా చెత్త సేవ అంటూ అసహనం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, 'ప్రధాని మోదీకి ఒత్తిళ్లకు తలవంచకండి.. అలాంటి పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో దేశంలో ప్రధాని ఖాతా ఒక్కటే నడిచే పరిస్థితి వస్తుంది' అంటూ మెటాపై విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా సంస్థలు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేజ్రీవాల్ సూచించారు. ఇదిలా ఉండగా, దేశంలో మెటా కార్యకలాపాలపై ప్రభుత్వ స్థాయిలో వివిధ అంశాలపై పరిశీలనలు కొనసాగుతున్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Loading Tweet...




















