
నన్ను కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించారు: సీఎం రేవంత్‌రెడ్డి
అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తనకు జరిగిన అవమానం కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమని అన్నారు. రాజకీయ కారణాలతోనే తన పర్యటనను అడ్డుకున్నారని ఆరోపించిన సీఎం.. గుజరాత్ ముఖ్యమంత్రికి అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి, తనకు ఎందుకు నిరాకరించారో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

