విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ టీజర్ విడుదలైంది. 19వ శతాబ్దపు బ్రిటిష్ పాలన, ప్రజల కష్టాలు, ఆహార సంక్షోభం, తిరుగుబాటు నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ శక్తిమంతమైన యోధుడిగా కనిపించనున్నాడు. టీజర్‌లోని యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్, విజయ్ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
ఇండస్ట్రీలో ఒక హీరో కోసం అనుకున్న కథ మరో హీరో దగ్గరకు వెళ్లడం చాలా కామన్. హీరోకు కథ నచ్చకపోవడం, డేట్స్ కుదరకపోవడం, ఇతర కారణాలతో ప్రాజెక్టులు చేతులు మారుతుంటాయి. అయితే తాను రిజెక్ట్ చేసిన కథతో మరో హీరో భారీ హిట్ కొడితే మాత్రం ఆ బాధ వేరే లెవల్‌లో ఉంటుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలోనూ ఇలాంటి చర్చే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.