సినీ ఇండస్ట్రీలో ఒక హీరో కోసం అనుకున్న కథ మరో హీరో దగ్గరకు వెళ్లడం చాలా కామన్. అయితే తాను వదులుకున్న కథతో మరో హీరో భారీ హిట్ కొడితే ఆ బాధ మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలోనూ ఇదే చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా మంచి స్పందన అందుకుంటున్న ‘డీసీ’ కథను విజయ్ ముందుగా విన్నాడని, కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్‌ను చేయలేదనే ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ‘భీష్మ’ కథ విజయ్ వద్దకు వెళ్లిందనే వార్తలు ఉన్నాయి. దీంతో ‘హిట్ సినిమాలను వదిలి ఫ్లాప్ సినిమాలు ఎంచుకున్నాడా?’ అంటూ నెటిజన్లు విజయ్ నిర్ణయాలపై చర్చిస్తున్నారు.. తాజాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి స్పందన అందుకుంటున్న ‘డీసీ’కథను విజయ్ ముందుగా విన్నాడని, అయితే కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్‌ను ఆయన చేయలేదనే ప్రచారం జరుగుతోంది.
‘ఖుషీ’ తర్వాత దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్.. విజయ్ దేవరకొండకు ఒక కథ చెప్పారని, అది ఆయనకు పూర్తిగా నచ్చకపోవడంతో ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదని టాక్. ఆ తర్వాత విజయ్ ‘కింగ్‌డమ్’ను ఎంచుకున్నాడు. అయితే అరుణ్ చెప్పిన కథే ‘డీసీ’ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేకపోయినా.. ఈ వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. మరోవైపు ‘డీసీ’తో లోకేష్ కనకరాజ్ హీరోగా పరిచయం అయ్యాడు. తొలి ప్రయత్నంలోనే సినిమాకు మంచి స్పందన రావడంతో పాటు తెలుగులోనూ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ దాటినట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఇలాంటి కథ విజయ్ చేసి ఉంటే ఆయన కెరీర్‌లో మరో భారీ హిట్ అయ్యేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
విజయ్ గతంలోనూ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడనే చర్చ ఉంది. నితిన్ కెరీర్‌లో మంచి విజయంగా నిలిచిన ‘భీష్మ’కథ మొదట విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్లిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాలతో విజయ్ ఆ సినిమాను చేయలేదని, ఆ తర్వాత నితిన్ హీరోగా ‘భీష్మ’ తెరకెక్కిందని టాక్. అదే సమయంలో విజయ్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాను ఎంచుకున్నాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ఇప్పుడు ‘భీష్మ’ను వదిలి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చేశావు.. ఇప్పుడు ‘డీసీ’ కథను వదిలి ‘కింగ్‌డమ్’ చేశావంటూ కొందరు నెటిజన్లు విజయ్‌ను ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల కథలు విజయ్ వద్దకు వచ్చాయన్న విషయంపై అధికారిక ధృవీకరణ మాత్రం లేదు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో రెండు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రౌడీ జనార్ధన’లో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో విజయ్‌ను ఇంతకుముందెన్నడూ చూడని రీతిలో చూపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాల దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న‘రణబలి’లోనూ విజయ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన కంటెంట్‌కు మంచి స్పందన వస్తోంది. వరుసగా విభిన్న కథలను ఎంచుకుంటున్న విజయ్.. ఈ రెండు సినిమాలతోనైనా తనపై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానం ఇస్తాడేమో చూడాలి.




















