ఉత్తరప్రదేశ్‌కు చెందిన విజయ్ కుమార్ శర్మ పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. 1999 నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఆయన.. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 59 ఏళ్ల వయసులో ప్రభుత్వ టీచర్‌గా నియమితులయ్యారు. పలుమార్లు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినా, ఇంటర్వ్యూల వద్ద ఎదురైన నిరాశలను అధిగమించి చివరకు తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వారణాసిలో పర్యటిస్తున్నారు. కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబాబు.. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా సాగుతోందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో రౌడీషీటర్ హత్య ఘటనపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. హత్యలకు అడ్డాగా తెలంగాణ మారిందని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చూసి సీఎం రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నేరాలు పెరిగాయని విమర్శించారు.