అమరావతి, ఆగస్టు 4 : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను భారతీయ జనతా పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివ్ ప్రకాశ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
పవన్ కల్యాణ్ త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని ప్రజాసేవలో మరింత చురుకుగా పాల్గొనాలని శివ్ ప్రకాశ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం కాసేపు మాట్లాడుకున్నారు.
ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మధుకర్ కూడా పాల్గొన్నారు.





















