డ్రైవింగ్ లైసెన్స్‌దారులకు అలర్ట్.. సెప్టెంబరు 25లోపు ఈ పని చేయాల్సిందే!

డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని వాహనదారులకు సూచనలు జారీ అయ్యాయి. సెప్టెంబరు 25లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సారథి పరివాహన్ పోర్టల్‌ ద్వారా ఇంట్లో నుంచే ఉచితంగా మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.

17 సెప్టెంబర్, 2026 12:59 PM•ByNarender Kumar Nangunoori

Share this article

డ్రైవింగ్ లైసెన్స్‌దారులకు అలర్ట్.. సెప్టెంబరు 25లోపు ఈ పని చేయాల్సిందే!

Social Media Image

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (జనవాణి): డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాహనదారులకు ముఖ్యమైన సూచన. మీ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ లింక్ చేసి ఉందా? ఒకవేళ లేకపోతే లేదా పాత మొబైల్ నంబర్‌నే కొనసాగిస్తుంటే వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సెప్టెంబరు 25లోపు మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని పేర్కొంటున్నారు.

మొబైల్ నంబర్ ఎందుకు అప్‌డేట్ చేయాలి?

పాత డ్రైవింగ్ లైసెన్స్‌లలో మొబైల్ నంబర్ నమోదు కాకపోవడం, కొన్ని లైసెన్స్‌లలో పనిచేయని నంబర్లు ఉండటంతో డిజిటల్ సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉంటే ఈ-చలాన్లు, ట్రాఫిక్‌కు సంబంధించిన ముఖ్యమైన నోటిఫికేషన్లు వంటి సమాచారం సకాలంలో అందే అవకాశం ఉంటుంది.

ఇంట్లోనే అప్‌డేట్ చేసుకోవచ్చు

డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ లింక్ చేసుకోవడానికి ఆర్టీవో కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. సారథి పరివాహన్ పోర్టల్ ద్వారా ఇంట్లో నుంచే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసే విధానం:

మొబైల్ లేదా కంప్యూటర్‌లో Sarathi Parivahan పోర్టల్‌ను ఓపెన్ చేయండి.

మీ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్/తెలంగాణగా ఎంచుకోండి.

హోమ్‌పేజీలోని ‘Others’ మెనూలోకి వెళ్లండి.

అక్కడ ‘Mobile Number Update’ ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, పుట్టిన తేదీ తదితర వివరాలను నమోదు చేయండి.

వివరాలను ఒకసారి పరిశీలించి, అప్‌డేట్ చేయాల్సిన కొత్త మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.

మొబైల్‌కు వచ్చిన OTPని నమోదు చేసి ప్రక్రియను పూర్తి చేయండి.

ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత లైసెన్స్‌కు కొత్త మొబైల్ నంబర్ అప్‌డేట్ అవుతుంది. సెప్టెంబరు 25 గడువును దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవడం మంచిది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు