Google Gemini AI Pro Free: విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. ఏడాదిపాటు జెమిని ఏఐ ప్రో ఉచితం!

భారత్‌లోని విద్యార్థులకు టెక్ దిగ్గజం గూగుల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అర్హత ఉన్న కళాశాలల విద్యార్థులు ఏడాది పాటు గూగుల్ ఏఐ ప్రో ప్లాన్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. చదువుకు ఉపయోగపడే స్టడీ నోట్‌బుక్స్, ఫ్లాష్‌కార్డ్స్, ప్రాక్టీస్ క్విజ్‌లు, ఇంటరాక్టివ్ విజువలైజేషన్స్ వంటి ఏఐ టూల్స్‌ను కూడా గూగుల్ అందిస్తోంది.

20 ఆగస్టు, 2026 3:27 PM•ByNarender Kumar Nangunoori

Share this article

Google Gemini AI Pro Free: విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. ఏడాదిపాటు జెమిని ఏఐ ప్రో ఉచితం!

Social Media Image

ఇంటర్నెట్ డెస్క్, ఆగస్టు 20 (జనవాణి): టెక్ దిగ్గజం గూగుల్ విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. భారత్‌లోని అర్హత ఉన్న కళాశాలల విద్యార్థులు 12 నెలల పాటు గూగుల్ ఏఐ ప్రో ప్లాన్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. గురువారం నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తుందని గూగుల్ వెల్లడించింది.

విద్యార్థులకు ప్రత్యేక ఏఐ టూల్స్

గూగుల్ ఏఐ ప్రోతో పాటు విద్యార్థుల చదువుకు ఉపయోగపడే పలు కొత్త ఫీచర్లను సంస్థ తీసుకొచ్చింది. జెమిని యాప్‌లో స్టూడెంట్ హబ్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో స్టడీ నోట్‌బుక్స్, ఫ్లాష్‌కార్డ్స్, ప్రాక్టీస్ క్విజ్‌లు వంటి టూల్స్‌ను ఒకే చోట ఉపయోగించుకోవచ్చు.

స్టడీ నోట్‌బుక్స్‌తో సులభంగా చదువు

విద్యార్థులు తమ లెక్చర్ నోట్స్, క్లాస్ మెటీరియల్‌ను స్టడీ నోట్‌బుక్స్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. వాటిని విశ్లేషించిన జెమిని.. చదవాల్సిన అంశాలను విభజించి స్టడీ ప్లాన్‌ను రూపొందిస్తుంది. విద్యార్థులకు ఏ అంశాలపై అవగాహన తక్కువగా ఉందో గుర్తించేందుకు డయాగ్నస్టిక్ క్విజ్‌లు నిర్వహిస్తుంది. అవసరానికి అనుగుణంగా చిన్న పాఠాలు, క్విజ్‌లను కూడా రూపొందిస్తుంది. అంతేకాకుండా రియల్‌టైమ్ ప్రోగ్రెస్ డ్యాష్‌బోర్డ్ ద్వారా చదువులో పురోగతిని తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో స్టడీ మెటీరియల్‌లో గ్రాఫ్‌లు, చిత్రాలను కూడా జోడించనున్నట్లు గూగుల్ తెలిపింది.

3డీ సిమ్యులేషన్స్‌తో మరింత ఆసక్తికరంగా

విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానాలను మరింత సులభంగా అర్థమయ్యేలా చేయడానికి జెమిని 3డీ సిమ్యులేషన్స్, టేబుల్స్, గ్రిడ్స్ వంటి ఇంటరాక్టివ్ విజువల్స్‌ను రూపొందించగలదు. ఉదాహరణకు 3డీ డీఎన్‌ఏ నిర్మాణాన్ని తిప్పి చూడటం, పెండ్యులమ్‌లో ఎనర్జీ ట్రాన్స్‌ఫర్‌ను సిమ్యులేట్ చేయడం వంటి వాటిని ఉపయోగించుకోవచ్చు.విద్యార్థుల అనుమతితో పరీక్షలు, అసైన్‌మెంట్ డెడ్‌లైన్లు వంటి ముఖ్యమైన తేదీలను గూగుల్ క్యాలెండర్‌లోకి జెమిని యాడ్ చేసే సదుపాయం కూడా ఉంది.

యూట్యూబ్ ప్రీమియంపై డిస్కౌంట్

విద్యార్థుల కోసం గూగుల్ ఏఐ ప్రోతో పాటు యూట్యూబ్ ప్రీమియం బండిల్‌ను కూడా అందిస్తోంది. దీనిపై గరిష్ఠంగా 70 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుందని గూగుల్ తెలిపింది. అయితే ఉచిత కాలం పూర్తయిన తర్వాత ప్లాన్ ఆటోమేటిక్‌గా చెల్లింపు సబ్‌స్క్రిప్షన్‌గా మారుతుంది. సైన్‌అప్ సమయంలో చెల్లుబాటు అయ్యే పేమెంట్ మెథడ్ అవసరం. ఉచిత కాలం ముగిసేలోపు వినియోగదారులు సబ్‌స్క్రిప్షన్‌ను క్యాన్సిల్ చేసుకోవచ్చు.

విద్యార్థులు gemini.google.com/students ద్వారా ఈ ఆఫర్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకుని అర్హతను పరిశీలించుకోవచ్చు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు