Ration Cards | ఈ-కేవైసీ కోసం రేషన్ షాపుకు వెళ్లాల్సిన అవసరం లేదు..మీ ఫోన్‌తోనే ఇలా చేయండి

రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉండగా, ఇక మీ-సేవ కేంద్రం లేదా రేషన్ దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే మొబైల్ ఫోన్‌ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

13 ఆగస్టు, 2026 7:16 PM•ByNarender Kumar Nangunoori

Share this article

Ration Cards | ఈ-కేవైసీ కోసం రేషన్ షాపుకు వెళ్లాల్సిన అవసరం లేదు..మీ ఫోన్‌తోనే ఇలా చేయండి

హైదరాబాద్, ఆగస్టు 13 (జనవాణి): రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం రేషన్ షాపు లేదా మీ-సేవ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే మొబైల్ ఫోన్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం ఉంది.

ముందుగా మొబైల్‌లో Aadhaar Face RDతో పాటు Mera eKYC యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం Mera eKYC యాప్‌ను ఓపెన్ చేసి రాష్ట్రాన్ని ఎంపిక చేసి Proceed పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్‌ను నమోదు చేసి OTP ద్వారా ధ్రువీకరణ పూర్తి చేయాలి. తదుపరి క్యాప్చాను(Capcha)ను నమోదు చేస్తే రేషన్ కార్డులోని సభ్యుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అక్కడ ‘Face eKYC’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం మొబైల్ కెమెరా ముందు ముఖాన్ని చూపిస్తే ఫేస్ రికగ్నిషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ-కేవైసీ విజయవంతంగా పూర్తయిన వెంటనే స్క్రీన్‌పై సంబంధిత ధ్రువీకరణ సందేశం కనిపిస్తుంది. దీంతో రేషన్ కార్డు ఈ-కేవైసీ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకోవచ్చు.

వర్షాలు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ(SIR) కారణంగా రేషన్ కార్డు KYC పూర్తి చేసుకునే గడువును ఆగస్టు 31, 2026 వరకు పొడిగించింది. రేషన్ పొందుతున్న లబ్ధిదారులు ఈ గడువులోగా తమ KYC ప్రక్రియను పూర్తి చేసుకోవడం తప్పనిసరి. ఆగస్టు 31లోపు KYC పూర్తి చేసుకున్న వారికి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్‌ను ఒకేసారి పొందే అవకాశం ఉంటుంది. అందువల్ల రేషన్ కార్డుదారులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా KYC పూర్తి చేసుకోవడం మంచిదని అధికారులు తెలియజేస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు