ఏపీకి మరో రెండు ఎయిమ్స్‌లు ఇవ్వండి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ వినతి

ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్రానికి మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలని జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిసి వినతిపత్రం సమర్పించారు.

6 ఆగస్టు, 2026 4:55 PM•ByRalin

Share this article

ఏపీకి మరో రెండు ఎయిమ్స్‌లు ఇవ్వండి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ వినతి

మంగళగిరి ఎయిమ్స్ (File Photo)

న్యూఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్రానికి మరో రెండు ఎయిమ్స్‌లు (ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) మంజూరు చేయాలని జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాను గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం సేవలందిస్తున్న మంగళగిరి ఎయిమ్స్‌ను జాతీయ స్థాయి అత్యాధునిక వైద్య కేంద్రంగా అభివృద్ధి చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర విభజన అనంతరం దాదాపు ఐదు కోట్ల జనాభాకు ఒక్క మంగళగిరి ఎయిమ్స్ మాత్రమే అందుబాటులో ఉండటం సరిపోవడం లేదని లింగమనేని రమేశ్ పేర్కొన్నారు. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం, ప్రాంతీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాయలసీమలో ఒకటి, ఉత్తరాంధ్రలో మరో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.

గుండె, క్యాన్సర్, న్యూరో, అవయవ మార్పిడి, అత్యవసర ట్రామా కేర్ వంటి వైద్య సేవల కోసం రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఆయా ప్రాంతాల్లో ఎయిమ్స్‌ల ఏర్పాటు అవసరమని వివరించారు. గతంలో జమ్మూ–కశ్మీర్, బిహార్ వంటి రాష్ట్రాలకు ఒకటి కంటే ఎక్కువ ఎయిమ్స్‌లు మంజూరు చేసినట్లు గుర్తు చేస్తూ, అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు కూడా రెండు కొత్త ఎయిమ్స్‌లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా మంగళగిరి ఎయిమ్స్‌ను మరింత విస్తరించి సమగ్ర క్యాన్సర్ కేంద్రం, అవయవ మార్పిడి సంస్థ, న్యూరోసైన్సెస్ ఇన్‌స్టిట్యూట్, అత్యాధునిక గుండె వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పడకల సామర్థ్యం, బోధనా సిబ్బందిని పెంచాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని పేర్కొంటూ, ప్రధాన్ మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన తదుపరి విడతలో ఈ ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర మంత్రి నడ్డాను కోరారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు